అమరావతి/విజయవాడ, జనవరి 31 నిర్భయవార్త సిటీ బ్యూరో: ఈరోజు రాష్ట్ర భాజపా కార్యాలయంలో భక్తిమార్గ ప్రచారకుడు సంత్ రవిదాస్ జీ 649వ జయంతి కార్యక్రమం మరియూ కేద్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టనున్న దేశ ఆర్ధిక బడ్జెట్ ప్రత్యక్ష వీక్షణం -పనతల సురేష్
భక్తి మార్గ ప్రచారకుడు శ్రీ సంత్ రవిదాస్ జీ 649వ జయంతి సందర్బంగా రాష్ట్ర ప్రధానకార్యాలయం లో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారూ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ జీ తో పాటు ఎన్టీఆర్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొంటారు.

ఎస్సీ సామజికవర్గంలో పుట్టిన భగవత్ శ్రీ సంత్ రావిదాస్ గారు బాల్యంలోనే భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు అంతే కాకుండా ఒక్క ఎస్సీ సామజిక వర్గంలో కాకుండా అన్నీ కుల మతాల వారికి మార్గదర్శి గా, ప్రచారకుడిగా, భక్తి మార్గంమే మన దేశ వైభోగనికి పునాది అని తెలిపిన మహానుభావుడు సంత్ రవిదాస్ గారు అలాంటి మహనీయుడిని ఈ సందర్బంగా స్మరించుకోవటం మన దేశ జాతికి మన దేశ ప్రజలకి ఎంతో ఆదర్శనియమని సురేష్ తెలిపారు.
రేపు జరగబోయే కార్యక్రమం తో పాటు రేపు ఢిల్లీ లో పార్లమెంట్ నందు దేశ ఆర్ధిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి ప్రసంగాన్ని కూడా రాష్ట్ర పాతాధికారులు, ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొంటారు అని పనతల సురేష్ గారు ఈ ప్రకటన ద్వారా తెలిపారు.